అయ్యా వార్లు ఇది తగునా

అస్సలే ఇప్పుడు పరీక్షల కాలం ఇంకా మన పాఠశాలలో ప్రబుద్ధులు సిలబస్ సగం కూడా పూర్తి కానివ్వలేదు మరి ఇలాంటప్పుడు మీరు ప్రభుత్వంతో పోరాడడం సమంజసమేనా. మీ సమస్యలు ఏవైనా వుంటే మీ నాయకుల ద్వారా పరిష్కరించుకోవచ్చుగాని, ఇదే అదునుగా సెలవులు దొరికాయని భావించి మీ సొంత వూళ్ళకు చెక్కేయడం ఏమైనా సమంజసమా, ఎలాగూ మీ పిల్లలను కార్పోరేట్ పాఠశాలల్లో చదివిస్తున్నారు కదా మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించిన విధంగానే మరి మా పిల్లల భవిష్యత్తు గురించి కూడా కాస్త ఆలోచిస్తే బాగుండు సారు.

ఇచ్చట చరిత్ర నేర్పబడును

ఇదేమి బ్లాగు వింతగా వుందే అనుకోకండి, నిజం మన రాజకీయ నాయకుల మతి చూస్తుంటే నిజంగా మనం నేర్చుకున్న చరిత్ర అంతా సుద్ద తప్పులతడకేమో అని అనిపించక మానదు.

ఏ చిన్న పిల్ల వాడినడిగినా టక్కున మనం ఆడిగే ప్రశ్నకు జవాబు ఇస్తారు. ఇప్పుడు అదే ప్రశ్న మీకు నేను కూడా అడుగుతాను. ఆ ప్రశ్న యేమంటే

తాజ్ మహల్ కట్టించింది ఎవరు, ఎందుకు కట్టించారు ? అంతే నండి.

సమాధానం : శాహజాహాన్ కట్టించారు, తన ప్రేయసి అయిన ముంతాజ్ కోసం ఇది నిజం కదండి.
మరి షహజహాన్ ఆంత పెద్ద మహల్ ను ఏ మైనా కళ్ళు మూసుకుని కట్టించారా లేక ఒళ్ళు పొగరు వచ్చి కట్టించి వుంటార ?

ఇక అస్సలు సమస్య?

మొన్న పత్రికలలో కొందరు శివసేన కార్యకర్తలు తాజ్మహల్ నందు సాధారణ సందర్శకులుగా వెళ్ళి తాజమహల్ చుట్టు ప్రదక్శిణలు చేస్తూ ఇక్కడ పూర్వం శివుడి దేవాలయం వుండేదని మొరపెట్టుకున్నారట. దీన్ని అందుకున్న కొందరు కుటిల రాజకీయ నాయకుల సందట్లో సడేమియాలా అస్సలు తాజ్ మహల్ అక్కడ లేనట్ట్లు అక్కడ శివుని దేవాలయం వుందని పత్రికల ముందు కొట్టుకున్నారు. అంతే కాకుండా శ్రీ రాముడు లంకకు అస్సులు వారధిని నిర్మించలేదని కూడా సరిక్రొత్త చరిత్రలను పత్రికల ద్వార నేర్పించారు.
ఇది చూస్తూంటే త్వరలోనే మన పత్రికలలో మరో సంచలన వార్త వస్తుంది. అది ఏమంటే

మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది మహాత్మా గాంధిగారు కాదు బాల్ థాకరే గారు ఆంటారేమో.

అయ్యా రాజకీయ నాయకులు ,మీరు కూర్చీలకోసం ఏ మైనా చేయండి కాని మన దేశ చరిత్రను మాత్రం మార్చకండి.

తిరుమల వెంకటేశునిపై ఒక చిన్న కవిత

తిరుమల తిరుపతి వెంకటేశా....
నిన్ను చూడాలని వుంది నాకు చాలా ఆశా.... కాని,
నీ కొండ చూశా.... నీ కాలి నడక మెట్లు చూశా.... అందువల్ల
నా ప్రాణాలను సంకలో పుట్టుకుని మా వూరికి పరుగులు తీశా...

రమణీయమైన ఏడుకొండల వాడి దగ్గరికి పోవాలంటే ఏడు జన్మల ధన్యము తప్పనిసరి. ఎందరో భక్తులు తమ తమ కోర్కెల కోసం కాలి నడకన, మెట్లపై కుంకమ పెట్టడం, కర్పూరం అంటిచడం, మోకాళ్ళతో దర్శనం కోసం వెళ్ళడం చూసి నా జన్మ ధన్యమైనది.

ప్రజా తీర్పుకు ఇదేనా విలువ

తెలంగాణ పోరాట సమితి పేరుతో చంద్ర బాబు పుణ్యమా అని కేసిఆర్ పార్టి పెట్టి ప్రతీ సారి అధికారం కోసం రాజీనామా చేసి ఎన్నికలకు పోతున్న కేసీఆర్ కు బాగా బుద్ది చెప్పిన తెలాంగాణా ప్రజల నిర్ణయాన్ని మన దేవేంద్రగౌడ్ గారికి ఎందుకు అర్థం కాక పోయిందో అంతు పట్టడంలేదు.

స్వయాన తెలంగాణా ప్రజలే తమ నిర్ణయం సమైక్యవాదామని తెలిపితే వీరేమో అధికార దాహం కోసం వెంపర్లాడుతున్నారు. అస్సలు మన నాయకులకు ప్రజాభిప్రాయం ముఖ్యమా లేక అధికారమా ?

చిరంజీవి గారు మీ పార్టీలోకి చీడ పురుగులు వస్తున్నాయి జాగ్రత్త

రక్త దానం, నేత్ర దానం ఇతరాత్ర సామాజిక కార్యకలాపాలతో మంచి పేరుతో సాగే మీ లాంటి వారు రాజకీయ పార్టిని స్థాపించి ప్రజలలో మంచి చైతన్యం తేవాలని అనుకోవడం చాలా మంచి నిర్ణయం కాని మీ పార్టి లోకి వస్తున్న వారందరూ అటు టి.డి.పి, కాంగ్రెస్ పార్టీలలో సరైన గుర్తింపు మరియు లావాదేవీలు ఒక్క మాటలో చెప్పాలంటే పచ్చి దొంగలు చేరుతామని అంటున్నారు.

మీ రేమో ఏమి మాటలాడకుండా మౌనంగా మీ తమ్ముడిగారి ద్వారా రాజకీయ ప్రయత్నాలు చేస్తున్నారు దయచేసి మీరు పార్టి పెట్టాలి రాస్ఠ్రంలో రాజకీయ ప్రక్షాళన చేయాలి, ప్రజలకు మంచి నాయకుడిని ఇవ్వాలి అనుకుంటే దయచేసి పార్టీ వీడి వస్స్తున్న దొంగలకు మాత్రం స్తానం కల్పించవద్దు. ఈ రోజు టి.డి.పి, కాంగ్రెస్ పార్టీలలో వుంది మీ దగ్గరికి వచ్చిన కుక్కలు రేపు వేరే చోటికి వేరే వాడితో జతకడతాయని ఖచ్చితంగా చెప్పగలను.
దయ చేసి వీధి కుక్కలను చేర్చు కోకండి.

ప్రజలకు కావలసినది రాజీలేని నాయకులే కాని రాబందువులు మాత్రం కాదు.