అయ్యా చిరంజీవి గారు అసలు మీ చిరు కోరిక ఏమిటనేది నాకు అర్థం కావడం లేదండి సారు?
మీరు అసలు రాజకీయాలలోకి రావాలనుకుంటున్నారా లేదా ?
వచ్చి ఏమి చేయాలనుకుంటున్నారు ?
ఇక్కడ మేము ప్రతి రోజు రాజకీయ నాయకుల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటుంటాము (తిట్టుకోవడం).
మరి మీకేమో మా దేశంలో చాలా గొప్ప పేరు వుంది (సామాజిక కార్యక్రమాల వలన).
మీరు రాజకీయ బురదలో ఎందుకు స్నానం చేయాలని అనుకుంటున్నారో నాకు అర్థం కాక చస్తున్నాను.
మీరు ఆల్ రెడి ప్రజాసేవ చేస్తున్నారు కదా మరి రాజకీయ షేవ్ (సేవ)ఎందుకు దండగ.