నా బ్లాగు చదువుతున్న వారందరికి నమస్కారం, ముందుగా దసరా శుభాకాంక్షలు.
ఈ రోజు నేను చాలా హ్యాపీ వై బికాజ్ నా జీవితంలో నేను ఎప్పుడు కలవను, మాట్లాడను, అనుకున్న స్నేహితుడు నాకు ఎదురై ఎలావున్నావురా అని పలకరించడం, నాతో కలసి చాలా సేపు గడపడం. పరస్పరం బద్ధ శత్రువులుగా మారిన వాళ్ళం ఇలా కలుసుకుని మాట్లాడుకోవడం నాకు చాలా హ్యాపీగా వుందండి. ఇలా యెందుకు జరిగింది అంటే కేవలం డబ్బు మమ్మల్ని అలా మార్చింది.
కాలేజీలో మేము చదువులో మంచి స్థాయి వుండి, స్నేహం అంటే వీరిని చుసి నేర్వాలి రా అనే స్థాయిలో వున్న మేము కేవలం డబ్బు గొడవతో ఒకరికొకరం దూరం అయ్యాము. కాని ఈ రోజు అతను నా వద్దకే వచ్చి నా బాగోగు అడగడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.
ఇక ఎప్పుడు డబ్బు ముందు స్నేహాన్ని చులకన చేయరాదని తెలిసింది.